Farmer laborers complaint to Collector: బాపట్ల జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో అవినీతిపై కలెక్టర్ విజయకృష్ణన్‌కు రైతు కూలీలు ఫిర్యాదు చేశారు. అద్దంకి మండలం మణికేశ్వరం, బొమ్మనంపాడులో ఉపాధి హామీ పనులు తనిఖీ చేసేందుకు వచ్చిన కలెక్టర్‌కు కేవైసీ చేయాలంటే 100 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వేలిముద్ర వేయాల్సిన ప్రతిసారి 100 చెల్లించాలా? అంటూ కలెక్టర్‌ను ప్రశ్నించారు. గతంలో 50కి బదులుగా ఇప్పుడు 100 రూపాయలు తీసుకుంటున్నారని వాపోయారు. స్పందించిన కలెక్టర్ బొమ్మనంపాడు వీఆర్వో , అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి : అనకాపల్లి జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం..!