సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ శాఖ ఉద్యోగులు గుంటూరులో నిరసన కార్యక్రమం చేపట్టారు. గుంటూరు సంగడిగుంటలోని విద్యుత్ భవన్ ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి ఐదో రోజూ నిరసన తెలియజేశారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ చట్టం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని విద్యుత్ శాఖ ఉద్యోగుల ఐకాస రాష్ట్ర కార్యదర్శి నేత సుభాని అన్నారు. కేవలం ఉద్యోగులే కాకుండా సంస్థ కూడా నష్టాలలో కురుకుపోతుందన్నారు. తక్షణమే విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని.. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయాలన్నారు.
కేంద్రం తెచ్చిన విద్యుత్ చట్టం వలన వినియోగదారులతో పాటు ఉద్యోగులు , సంస్థ కూడా నష్టపోయే ప్రమాదం ఉందని విద్యుత్ శాఖ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగ బ్రహ్మచారి అన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : శీతల గిడ్డంగి మేనేజర్‌పై వ్యాపారి పెట్రో దాడి