ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరికి మూడు మాస్కుల పంపిణీ - Dwakra women making masks

కరోనా వైరస్​ నివారణలో భాగంగా అందరికీ మాస్కులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మొదటగా గుంటూరులోని రెడ్​జోన్​ ప్రాంతాలకు... ఆ తర్వాత అందరికీ మాస్కులు పంపిణీ చేయనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరికి మూడేసి చొప్పున మాస్కుల పంపిణీ

author img

By

Published : Apr 24, 2020, 6:28 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరికి మూడేసి చొప్పున మాస్కుల పంపిణీ

కరోనా నివారణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మనిషికి మూడు మాస్కులు చొప్పున అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మాస్కుల తయారీ బాధ్యతను స్వయంసహాయక సంఘాల మహిళలకు అప్పగించింది. దాంట్లో భాగంగా మెప్మా, డ్వాక్రా మహిళలు మాస్కుల తయారీని యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. మాస్కుల తయారీ వస్త్రం, ఇతర వస్తువులను అధికారులే అందిస్తుండగా... మాస్కు కుట్టినందుకు నిర్ణీత మొత్తాన్ని మహిళలకు చెల్లిస్తున్నారు. గుంటూరులో నల్లచెరువు, లక్ష్మీపురం మెప్మా బజార్లలో వీటిని స్వయంసహాయక సంఘాల మహిళలు తయారుచేస్తున్నారు. వాటిని తొలుత రెడ్​జోన్​ ప్రాంతాలకు... ఆ తర్వాత అందరికీ పంపిణీ చేస్తున్నారు. ఇలాంటి కష్టకాలంలో మాస్కుల తయారీ ద్వారా తమకు ఉపాధి దొరికిందని స్వయంసహాయక సంఘాల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: జిల్లాలో ఒక్కొక్కరికి మూడు మాస్కులు పంపిణీ: మెప్మా పీడీ రామ్మోహన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.