ETV Bharat / city

మద్యం దుకాణాల్లో.. మందుబాబుల యుద్ధం! - ap latest news

సహజంగా సినిమా టికెట్ల కోసం.. తోపులాట.. జరుగుతుంది. కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానంతో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఒక్క సీసా అయినా.. దొరికితే చాలు దేవుడా అనుకుంటూ.. ఎగబడ్డారు. పద్ధతిగా క్యూ లైన్​ కట్టి మరీ వేచి చూశారు.

drinkers-at-bar-shops
author img

By

Published : Oct 1, 2019, 5:49 AM IST

Updated : Oct 1, 2019, 7:50 AM IST

ప్రైవేట్ మద్యం దుకాణాలకు గడువు ముగియడంతో నిన్న రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా... మందు బాబులు మద్యం దుకాణాలపై విరుచుపడ్డారు. కొన్ని దుకాణాల్లో మద్యం అయిపోవడంతో ఏం చేయాలో తెలియక అయోమయానికి గురయ్యారు. సినిమా టికెట్ల కోసమైనా.. ఇంత కష్టపడ్డారో లేదో.. గానీ.. మందు సీసా కోసం మాత్రం తెగ కష్టపడిపోయారు. కడపలోని పలు బార్ల యజమానులు ఇదే అదునుగా భావించి అధిక ధరకు విక్రయించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎక్సైజ్ శాఖ సోమవారం నుంచే అమ్మకాలు ప్రారంభించింది. ఇతర మద్యం దుకాణాల్లో మందు లేకపోవడంతో.. మందుబాబులు క్యూ లైన్ కట్టారు. ఒక్కొక్కరికీ మూడు సీసాలు చొప్పున విక్రయించారు. అబ్కారీ అధికారులు దగ్గరుండి మరీ మద్యం అమ్మకాలను పర్యవేక్షించారు.

మద్యం దుకాణాల్లో.. మందుబాబుల యుద్ధం!

ఇదీ చదవండి:మద్యం దుకాణాల్లో పనికి పీహెచ్‌డీ అభ్యర్థి దరఖాస్తు!

Last Updated : Oct 1, 2019, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.