డబుల్ హార్స్ మినపగుళ్ల సంస్థ మూడో ప్లాంటు ప్రారంభోత్సవం గుంటూరు జిల్లా తెనాలి శివారు నందివెలుగులో ఘనంగా జరిగింది. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, సీరియల్ నటి నవ్య, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు సహా పలువురు ప్రముఖులు ప్రారంభోత్సవానికి అతిథులుగా హాజరయ్యారు. తెనాలి ఖ్యాతిని డబుల్‌హార్స్ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రశంసించారు. వ్యాపారుల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున తోడ్పడతామని చెప్పారు. నాణ్యతతో వినియోగదారుల మన్ననలు పొందుతున్నామని డబుల్ హార్స్ సంస్థ యజమాని మోహన్‌శ్యామ్ ప్రసాద్ అన్నారు.
ఇదీచదవండి.