గుంటూరు నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్‌పై కౌన్సిల్ సమావేశమైంది. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాజీలు కూడా కార్పొరేటర్లుగా చలామణి అవుతున్నారని నగర మేయర్, కమిషనర్‌ను తెదేపా కార్పొరేటర్లు ప్రశ్నించడంతో తెదేపా, వైకాపా కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు.
కార్పొరేటర్లే హాజరుకావాలని.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని అప్పిరెడ్డి సూచించారు. ఫ్లెక్సీల్లో కొంతమంది కార్పొరేటర్లుగా పేర్లు వేసుకుంటున్నారన్న మేయర్ కావటి మనోహర్ నాయుడు... తగిన ఆదేశాలు ఇస్తామని తెలిపారు. జీఎంసీ తరఫున చర్యలు తీసుకుంటామని సభను ఉద్దేశించి మాట్లాడారు.
ఇదీ చదవండి: high court: 'ఆ కళ్యాణ మండపం కూల్చివేతకు చర్యలు తీసుకోవాలి'