ETV Bharat / city

Disha: బోధనాస్పత్రుల్లో దిశ వన్ స్టాఫ్ సెంటర్లు: మంత్రి సుచరిత - disha act in ap latest news

అత్యాచార బాధితులకు అండగా బోధనాస్పత్రుల్లో దిశ వన్ స్టాఫ్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని హోంమంత్రి సుచరిత అన్నారు. గుంటూరు మహిళా ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన దిశ వన్ స్టాఫ్ సెంటర్​ను మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితతో కలిసి సుచరిత ప్రారంభించారు. అత్యాచార బాధితులకు రక్షణతోపాటు.. మానసికంగా భరోసా కల్పించేందుకు కౌన్సెలింగ్ ఇస్తామని మంత్రి తానేటి వనిత అన్నారు.

disha one stop centers at medical colleges  in andhra pradesh

author img

By

Published : Jul 29, 2021, 3:37 PM IST

మాట్లాడుతున్న మంత్రులు

దిశ చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తామని హోంమంత్రి సుచరిత అన్నారు. కేంద్రం కోరినట్లు దిశ చట్టంలో సవరణలు చేసి మళ్లీ పంపించామని స్పష్టం చేశారు. అత్యాచార బాధితులకు అండగా బోధనాస్పత్రుల్లో దిశ వన్ స్టాఫ్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. గుంటూరు మహిళా ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన దిశ వన్ స్టాఫ్ సెంటర్​ను మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితతో కలిసి సుచరిత ప్రారంభించారు. మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరిధర్, కలెక్టర్ వివేక్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

దిశ వన్ స్టాఫ్ సెంటర్ల ద్వారా అత్యాచార బాధితులకు రక్షణతోపాటు.. మానసికంగా భరోసా కల్పించేందుకు కౌన్సెలింగ్ ఇస్తామని మంత్రి తానేటి వనిత చెప్పారు. అత్యాచార కేసుల విచారణ వేగవంతం చేయడానికి దిశ చట్టంలో మార్పులు తెచ్చామన్నారు. బాధితులకు న్యాయపరంగా సహాయం అందిస్తామని మంత్రి వనిత చెప్పారు.

ఇదీ చదవండి: ap legislative: ఏపీ శాసనమండలి రద్దు అంశం పరిశీలనలో ఉంది: కిరణ్‌రిజుజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.