లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని శాసనసభ ఉప సభాపతి కోన రఘపతి సూచించారు. కొద్ది రోజులు ఓపిక పడితే కరోనాను తరిమి కొట్టవచ్చని బాపట్లలో ప్రచారం చేశారు. సామాజిక దూరం పాటించటం, చేతులు శుభ్రంగా కడుక్కోవటం, అత్యవసరమైతేనే బయటకు రావడం వంటి చర్యలు పాటించాలన్నారు. ఇది మన కోసం మన భవిష్యత్తు కోసం అని చెప్పారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ఇదీ చూడండి: