Degree Students protest: గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలలో ఈనెల 14 నుంచి నిర్వహించే సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలంటూ విద్యార్థులు ధర్నాకు దిగారు. విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం నుంచి ఉపకులపతి కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. సిలబస్ పూర్తి కాకుండా పరీక్షలు ఎలా నిర్వహిస్తారని విద్యార్థులు ప్రశ్నించారు. జులైలో మూడో సెమిస్టర్ పరీక్షలు పెట్టిన అధికారులు... మళ్లీ మూడు నెలల వ్యవధిలోనే నాలుగో సెమిస్టర్‌కు షెడ్యూల్ ఎలా విడుదల చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తే చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యే అవకాశముందని చెప్పారు. పరీక్షల షెడ్యూల్ రద్దు చేసే వరకు పోరాటం ఆపబోమని తేల్చిచెప్పారు.
ఇవీ చదవండి: