రాష్ట్రంలో ఇసుక విధానం ప్రజలు, నిర్మాణదారుల కోసమే కానీ మాఫియా కోసం కాదని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఇసుక కొరత వల్ల కొన్ని సమస్యలు ఎదురైనా... ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. క్రెడాయ్ ఆధ్వర్యంలో గుంటూరులో ఏర్పాటు చేసిన స్తిరాస్థి ప్రదర్శనను స్పీకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, MLAలు అంబటి రాంబాబు, రజని, ముస్తఫా, మద్దాలి గిరిధర్ పాల్గొన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా గృహ నిర్మాణాలు చేపట్టాలని క్రెడాయ్ ప్రతినిధులకు సూచించారు. అందరికీ గృహయోగం కల్పించటంలో బ్యాంకర్లు కూడా చొరవ చూపాలన్నారు
ఇదీ చదవండి