కరోనా విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ అన్ని పార్టీల నేతలు, ముఖ్యమంత్రులతో చర్చించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు అన్ని పార్టీల నేతలతో ఎందుకు చర్చించలేదని నిలదీశారు. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో... అసలు ఎన్ని కేసులు వచ్చాయి అనే అంశాలను తెలియజేయాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. రాష్ట్రంలో వలస కార్మికులను ఆదుకోవాలని లేబర్ కమిషనర్ రేఖారాణికి వినతి పత్రం ఇచ్చారు. లాక్ డౌన్ వల్ల వలస కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని వారికి తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లాలో మృతిచెందిన కార్మికుడికి ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: