వలస కూలీలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. వారిలో విశ్వాసం నింపలేకపోయిందని విమర్శించారు. లాక్డౌన్ కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలని హితవుపలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 10 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా గోదాముల్లో ఉన్న 5.30 కోట్ల టన్నుల్లో నుంచి కోటి టన్నుల ధాన్యాన్ని రాష్ట్రాలకు సరఫరా చేసి... ప్రజలకు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడే విధంగా... సీఎం జగన్ అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాలని కోరారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు అన్ని పన్నులు వసూలు వాయిదా వెయ్యాలన్న రామకృష్ణ... అలా కాకుండా వసూలు చేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండీ...ఖరీఫ్‌కు పటిష్ఠ ప్రణాళికతోనే రైతన్నకు దన్ను