గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసుల ఉద్ధృతి తగ్గినప్పటికీ.. వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. కొత్తగా జిల్లాలో 301 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 66వేల 205కు పెరిగాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరం నుంచే 75 బయటపడ్డాయి. మంగళగిరిలో 30 కేసులు, తెనాలిలో 16, పొన్నూరులో 15, తాడేపల్లిలో 14, రేపల్లె, బాపట్లలో 12 కేసులు చొప్పున, దుగ్గిరాల, పెదనందిపాడులో 10 కేసులు చొప్పున నమోదైనట్లు గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి యాస్మిన్ బులిటెన్ విడుదల చేశారు. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 60వేల 632 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో ఇవాళ జిల్లాలో ఇద్దరు మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 608కి చేరింది. రాష్ట్రంలో కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభంవించిన జిల్లాల్లో గుంటూరు రెండోస్థానంలో కొనసాగుతోంది.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొత్తగా 2,997 కరోనా కేసులు, 21 మరణాలు నమోదు