గుంటూరు జిల్లాలో అధికారులు చేసిన పొరపాట్ల వల్ల కరోనా పాజిటివ్ రోగి ఇంటికి చేరారు. తాడేపల్లి మండలం నులకపేటకు చెందిన ఓ వ్యక్తి దిల్లీ వెళ్లి రావడంతో అధికారులు ఆయన్ను క్వారంటైన్‌కు తరిలించారు. అదే క్వారంటైన్లో నులకపేటకు చెందిన వ్యక్తి పేరుతోనే మరో వ్యక్తి ఉన్నారు. ఇద్దరికీ అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఇద్దరిదీ ఒకే పేరు ఉండటంతో అధికారులు పొరపాటున పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఇంటికి పంపించారు.
తీరా అసలు విషయం తెలుసుకున్న అధికారులు తాము చేసిన పొరపాటును గుర్తించి ఇంటికి పంపిన వ్యక్తిని మళ్లీ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. మొదట పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఐసోలేషన్ కు వెళ్లేందుకు నిరాకరించారు. తనకు అధికారులు గుర్తింపు పత్రం ఇచ్చారని... నేను రానని మొండికి వేయడంతో వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు... పాజిటివ్ వచ్చిన వ్యక్తిని అంబులెన్స్‌లో ఐసోలేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: