ETV Bharat / city

గుంటూరు గజగజ... 10 రోజుల్లో 1811 కేసులు - గుంటూరు కొవిడ్ కేసులు మొత్తం

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కేవలం 10 రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు కావటం వైరస్‌ ఉద్ధృతికి, పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రజలు ఎక్కువ సంఖ్యలో బయటకు రావటం, కొందరు కనీస జాగ్రత్తలు పాటించకపోవటంతో వైరస్ విజృంభిస్తోందని అధికారులు చెబుతున్నారు.

గుంటూరు గజగజ... 10 రోజుల్లో 1811 కేసులు
గుంటూరు గజగజ... 10 రోజుల్లో 1811 కేసులు
author img

By

Published : Jul 11, 2020, 6:01 AM IST

అన్​లాక్ తర్వాత గుంటూరు జిల్లాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కొత్తగా 208 కేసులు నమోదుకాగా... మొత్తం కేసులు 3416కు చేరాయి. ఇప్పటి వరకూ గుంటూరు జిల్లాకు చెందిన 2799 మందికి, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 617మందికి పాజిటివ్​గా తేలింది. వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగికి, అతని భార్యకు పాజిటివ్​గా నిర్థరణ అయింది. తెనాలిలో 19, నరసరావుపేటలో 14, తాడేపల్లిలో 13, పిడుగురాళ్లలో 11, వినుకొండ 7 కేసులు వెలుగుచూశాయి. పిడుగురాళ్లలో రోజూ మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చారు. తాడికొండ నియోజకవర్గంలోని పోట్లపాడుకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్త కరోనా బారినపడ్డారు. మందపాడలో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా వచ్చింది.

10 రోజుల్లో 1811 కేసులు

మార్చి, ఏప్రిల్ నెలల్లో గుంటూరు జిల్లాలో 287 కేసులు రాగా... మే నెలలో 223 నమోదయ్యాయి. జూన్ నెలలో 1095 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇక జులైలో పట్టపగ్గాలు లేకుండా కేసులు నమోదవుతున్నాయి. నిత్యం 200, 300 కేసులు వస్తున్నందున కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. గత 10 రోజుల్లోనే 1811 కేసులు వెలుగుచూశాయి.

ఆంక్షలు కఠినం

జూన్ నెలాఖరు వరకూ 1605 కేసులుండగా.... కేవలం పది రోజుల్లోనే అంతకు మించి కేసులు వచ్చాయి. జిల్లా అధికారులు వైరస్ నియంత్రణ చర్యలపై దృష్టి పెట్టారు. కేసులు ఎక్కువగా ఉన్న గుంటూరు నగరంలోని కంటైన్మెంట్ జోన్లలో పర్యటించి...ప్రజల రాకపోకలు తగ్గేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. మాస్క్ , భౌతిక దూరం నిబంధనలను అతిక్రమించే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరిచారు. గుంటూరు నగరంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే తమ కార్యకాలాపాలు ఉండేలా వర్తక, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు తర్వాత ఎక్కువ కేసులు ఉన్న ప్రాంతాల్లోనూ ఆంక్షలు కఠినతరం చేశారు. దుకాణాలు తెరిచే వేళలను కుదిస్తున్నారు.

దాతృత్వం

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు, సిబ్బందికి అందజేయాలని కోరుతూ గుంటూరు వైద్య కళాశాల 1980 బ్యాచ్ పూర్వ విద్యార్ధులైన డా. నాగేశ్వరమ్మ , డా.శారద 1000 ఫేస్‌ షీల్డ్ మాస్కులను కలెక్టర్‌కు అందజేశారు.

ఇదీ చదవండి : సీఎంఆర్​ఎఫ్​కు సీసీఎల్ ప్రొడక్ట్స్ రూ.1.11 కోట్లు విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.