గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. జిల్లాలో కొత్తగా 707 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 44వేల 217 మంది కరోనా బారిన పడ్డారు. కోలుకుని 33వేల 994 మంది ఇంటికి చేరుకున్నారు. జిల్లాలో ఇవాళ కొవిడ్ వైరస్ ప్రభావంతో 6 మంది మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 444 కి చేరింది.
రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు రెండవ స్థానంలో నిలిచింది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 188 కేసులు నమోదయ్యాయి.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం మండలాల వారిగా నమోదైన కేసులు వివరాలు ఇలా ఉన్నాయి. నరసరావుపేట-121, తెనాలి-40, బాపట్ల-33, తుళ్లూరు-31, చ్చంపేట-30, తాడేపల్లి-28, దాచేపల్లి-24, మాచర్ల-22, పెదనందిపాడు-16, కారంపూడి-16, సత్తెనపల్లి-16, చేబ్రోలు-12, వట్టిచెరుకూరు-11, రెంటచింతల-11, పొన్నూరు-11, పెదకూరపాడు-10 చొప్పున కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: