మాజీ మంత్రి అచ్చెన్నాయుడి డిశ్ఛార్జి విషయంలో గందరగోళం నెలకొంది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాత్రివేళ ఆసుపత్రి వర్గాలు డిశ్ఛార్జి ఆర్డర్ ఇచ్చాయి. ఎందుకు డిశ్ఛార్జి చేస్తున్నారంటూ.. అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాది హరిబాబు ప్రశ్నించారు. ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారని ఏఆర్ఎంవో సతీష్ మెుదట తెలిపినా... కాసేపటికే డిశ్ఛార్జి రద్దు చేసినట్లు ప్రకటించారు.
ఈఎస్ఐ అవకవతకల కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కొన్ని రోజుల కిందట అరెస్టు అయ్యారు. విచారణ చేపట్టిన అనిశా న్యాయస్థానం.. అచ్చెన్నకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఆయనకున్న అనారోగ్యం దృష్ట్యా పోలీసుల పర్యవేక్షణలో ఆసుపత్రిలో చికిత్స అందించాలని తెలిపింది. ఈ మేరకు గుంటూరు జీజీహెచ్లో మాజీ మంత్రి చికిత్స పొందుతున్నారు. తాజా కస్టడీకి అనిశా అధికారులు అనుమతి కోరగా..మూడు రోజులపాటు ఆస్పత్రిలోనే విచారించాలని న్యాయస్థానం అనుమతించింది. అయితే అచ్చెన్న డిశ్ఛార్జి విషయంలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది.
ఇదీ చదవండి: