కరోనా కష్టకాలంలో సేవలు అందించిన తమను తొలగించడం భావ్యం కాదని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన చెందారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జీజీహెచ్ ఎదుట ఆందోళనకు దిగారు. కరోనా రోగులకు చేసిన సేవలను గుర్తించకుండా.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం తమను తొలగించిందని ఆగ్రహించారు. ప్రాణాలకు తెగించి పోరాడితే ఇదేనా ఫలితం అని ప్రశ్నించారు. ఉద్యోగ భద్రత కల్పించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: