విద్యుత్ శాఖ, సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ ఇవాళ సమీక్షలు నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే భేటీల్లో ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. తొలుత.. ఉదయం 10గంటలకు విద్యుత్ శాఖపై సీఎం సమీక్ష జరుపుతారు. ఖరీఫ్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు పగటి పూటే తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది. పగలే 9 గంటల విద్యుత్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రకటించారు. ఎప్పటి నుంచి ఇవ్వాలనే అంశంపై ఇవాళ అధికారులతో సీఎం చర్చించనున్నారు . మధ్యాహ్నం సీఆర్డీఏపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. కృష్ణానదీ తీరం వెంట అక్రమ కట్టడాల కూల్చివేతను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ప్రజావేదిక పక్కనే ఉన్న చంద్రబాబు ఇల్లు సహా కరకట్ట వెంట ఉన్న మరిన్ని నిర్మాణాల కూల్చివేతపై సీఎం అధికారులతో సమీక్షించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రాజధాని నిర్మాణం, అభివృద్ధి, భూముల కేటాయింపు అంశాలపైనా ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. రాజధాని భూముల కేటాయింపు, భవన నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తే సమగ్ర విచారణ చేస్తామని కూడా ఎన్నికలకు ముందు ప్రకటించారు. ఈ నేపథ్యంలో విచారణ విషయమై ఇవాల్టి సమీక్షలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
చంద్రబాబు నివాసంపై నేడు నిర్ణయం తీసుకోనున్న సీఎం జగన్ - demolish
నేడు సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ భేటీలో చంద్రబాబు నివాసం సహా కరకట్ట వెంట ఉన్న నిర్మాణాలు కూల్చివేతపై కీలయ నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక రాజధానిపై తొలిసారి సమీక్ష నిర్వహించనున్నారు.
విద్యుత్ శాఖ, సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ ఇవాళ సమీక్షలు నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే భేటీల్లో ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. తొలుత.. ఉదయం 10గంటలకు విద్యుత్ శాఖపై సీఎం సమీక్ష జరుపుతారు. ఖరీఫ్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు పగటి పూటే తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది. పగలే 9 గంటల విద్యుత్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రకటించారు. ఎప్పటి నుంచి ఇవ్వాలనే అంశంపై ఇవాళ అధికారులతో సీఎం చర్చించనున్నారు . మధ్యాహ్నం సీఆర్డీఏపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. కృష్ణానదీ తీరం వెంట అక్రమ కట్టడాల కూల్చివేతను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ప్రజావేదిక పక్కనే ఉన్న చంద్రబాబు ఇల్లు సహా కరకట్ట వెంట ఉన్న మరిన్ని నిర్మాణాల కూల్చివేతపై సీఎం అధికారులతో సమీక్షించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రాజధాని నిర్మాణం, అభివృద్ధి, భూముల కేటాయింపు అంశాలపైనా ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. రాజధాని భూముల కేటాయింపు, భవన నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తే సమగ్ర విచారణ చేస్తామని కూడా ఎన్నికలకు ముందు ప్రకటించారు. ఈ నేపథ్యంలో విచారణ విషయమై ఇవాల్టి సమీక్షలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
New Delhi, June 25 (ANI): While speaking to ANI, after taking oath actor turned politician Mimi Chakraborty said, "Today was my first day it was a great experience for me I took oath and we listened the speech of PM Modi. We are coming tomorrow again with the problems of our constituency to seek help from the centre. What is common between film life and politics is that we work for the people.We are for the people, responsibilities are definitely big but at the same time we are ready for it."