ETV Bharat / city

బిల్లుల ఆమోదానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

మూడు రాజధానుల బిల్లుల ఆమోదంపై నిరసనలు తీవ్రమయ్యాయి. గవర్నర్​ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. గుంటూరులో రాజకీయేతర ఐకాస నేతలు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం పాటిస్తూ వారు ఆందోళన నిర్వహించారు. గవర్నర్​ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామని ఐకాస నేతలు స్పష్టం చేశారు.

బిల్లుల ఆమోదానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ
బిల్లుల ఆమోదానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ
author img

By

Published : Aug 1, 2020, 10:27 PM IST

మూడు రాజధానుల బిల్లుల ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో రాజకీయేతర ఐకాస ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అంబేడ్కర్​ కూడలి వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఒకే రాష్ట్ర.. ఒకే రాజధాని.. మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు.

బిల్లులు ఆమోదిస్తూ.. గవర్నర్ తీసుకున్న​ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని ఐకాస నేతలు స్పష్టం చేశారు. రాజధాని రైతుల ఆకాంక్షలను తుంగలో తొక్కుతూ.. వారి ఆందోళనలు పెడచెవిన పెడుతూ.. ప్రభుత్వం ముందుకెళ్లటం సరికాదని ఐకాస నేత మల్లిఖార్జున్ అభిప్రాయపడ్డారు. గవర్నర్ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి తిప్పి పంపాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి..

అమరావతే మా రాజధాని.. అవసరమైతే న్యాయపోరాటమే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.