ETV Bharat / city

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది: భాజపా - BJP Yuva Morcha Meeting at Guntur

BJP Yuva Morcha Meeting: వైకాపా పాలనపై బాజపా నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో సనాతన ధర్మం ప్రమాదంలో పడిందని భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ సునిల్ దేవ్​ధర్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్​ సీఎం అయ్యాక ప్రజలపై మోయలేని భారం పడిందని.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు.

BJP_Yuva_Morcha_Meeting_
BJP_Yuva_Morcha_Meeting_
author img

By

Published : May 24, 2022, 3:58 PM IST

BJP Yuva Morcha Meeting: వైకాపా పాలనలో సనాతన ధర్మం ప్రమాదంలో పడిందని భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ సునిల్ దేవ్​ధర్ అన్నారు. గుంటూరులో జరిగిన భాజపా యువమోర్చా రాష్ట్ర కమిటి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హిందు ఆలయాలు, సంప్రదాయాలపై దాడులు పెరిగాయని.. దీన్ని ప్రధాన ప్రతిపక్షం తెదేపా మౌనంగా చూస్తోందని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇలా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత సంఖ్య పెరిగిపోతుందని, ఇసుక మాఫియా చెలరేగిపోతోందని విమర్శించారు. కేంద్రం పన్నులు తగ్గించినా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్రో ధరలు తగ్గించటంలేదని ప్రశ్నించారు. భాజపాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారుతుందని అన్నారు.

భాజపా కేంద్ర కమిటి సభ్యులు కన్నా లక్ష్మినారాయణ మాట్లాడుతూ... జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వైకాపా ప్రజలపై మోయలేని పన్నుల భారం మోపి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. వైకాపా ఎమ్మెల్సీ తన కారు డ్రైవర్​ను చంపి మృతదేహాన్ని కారులో వేసుకుని వెళ్లటమే ఇందుకు నిదర్శనంగా అభివర్ణించారు.

ఇవీ చదవండి :

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.