మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా.. బ్యాంకులకు సెలవు ఇవ్వకపోవడాన్ని ఉద్యోగ సంఘాలు తప్పుబడుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో సెలవు ప్రకటించినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం పనిదినంగానే కొనసాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఇచ్చి, బ్యాంకు ఉద్యోగులను మాత్రం ఎందుకు మినహాయించారని ప్రశ్నిస్తున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ కన్వీనర్ రాంబాబు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
ఈనెల 19న బ్యాంకు ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. గతంలో వినాయక చవితికి కూడా ఇలాగే సెలవు ఇవ్వలేదని.. తాము విజ్ఞప్తి చేసిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని గుర్తుచేశారు.
ఇదీ చదవండి: