పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కల్పితమని ఫిర్యాదుదారులు ఆరోపించారు. తమను చింతమనేని ప్రభాకర్ దూషించినట్లు పోలీసులే కథ అల్లారని బిళ్లా రామకృష్ణ, తోట సందీప్ వెల్లడించారు. గుంటూరులోని తెదేపా రాష్ట్రా కార్యాలయాని వచ్చిన ఫిర్యాదుదారులు... పలు విషయాలు వెల్లడించారు. పోలీసులే తమతో బలవంతంగా కేసు పెట్టించారని స్పష్టం చేశారు.
'చింతమనేని మాపై కేసు పెట్టారంటే స్టేషన్కు వెళ్లాం. అసలు ఆ రోజు ఆయన సంఘటనా స్థలానికే రాలేదు. పోలీసులే మాతో బలవంతంగా కేసు పెట్టించారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అంతా కల్పితమే.'
-- చింతమనేనిపై కేసు పెట్టిన వ్యక్తులు.
ఇవీ చదవండి...'చింతమనేని వీడియో ఎడిట్, చేసి వైరల్ చేశారు'