రేపటి నుంచి వారం రోజులపాటు జరగనున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షలకు గుంటూరు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలిరోజు 212 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనుండగా... 86వేల 514 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి కొవిడ్ ప్రాథమిక లక్షణాలున్న వారికి ప్రత్యేక ఐసోలేషన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తప్పక మాస్కులు ధరించి రావాలని... రెండు గంటల ముందుగానే అంటే ఉదయం 8 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ సూచించారు.
ఇదీ చదవండీ... పోలవరం బిల్లుల్లో రూ.760 కోట్లకు అర్హత లేదు: కేంద్రం