ETV Bharat / city

ఇంటి కూల్చివేతపై 'స్పందన'ను ఆశ్రయించిన ఆర్మీ జవాన్ - ఏపీలో స్పందన కార్యక్రమం

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇంటిని కూల్చివేశారంటూ నరసరావుపేటకు చెందిన ఆర్మీ జవాన్ గోవిందరెడ్డి స్పందనలో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమి అంటూ అధికారులు కూల్చివేశారని పేర్కొన్నారు. 50 రోజులుగా తిరుగుతున్నా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

army jawan govinda reddy house demolition
ఆర్మీ జవాన్ గోవిందరెడ్డి ఇంటి కూల్చివేత
author img

By

Published : Jan 11, 2021, 5:41 PM IST

తన ఇంటిని కూల్చివేశారంటూ గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఆర్మీ జవాను గోవిందరెడ్డి.. జిల్లా గ్రామీణ ఎస్పీ గ్రీవెన్స్ కార్యాలయాన్ని సంప్రదించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మున్సిపల్ అధికారులు కూల్చివేశారని.. దీనిపై చర్యలు చేపట్టాలంటూ ఫిర్యాదులో కోరారు. ప్రభుత్వ భూమి అంటూ చెబుతున్నారని.. తాము వేరే ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఈ భూములు కొన్నామని ఆర్మీ జవాను గోవిందరెడ్డి చెప్పారు. ఈ భూమిపై స్పష్టత ఇవ్వాలని 50 రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని గోవిందరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు ఇంటిని నిర్మించిన భూమిని తనకు అప్పగించాలని కోరారు. ఇద్దరం సోదరులం ఆర్మీలో పనిచేస్తున్నామని తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గోవిందరెడ్డి కోరారు.

ఆర్మీ జవాన్ గోవిందరెడ్డి

2010లో నరసరావుపేటలో ఆరు సెంట్ల స్థలం కొన్నాను. పంచాయతీ పర్మిషన్ తీసుకుని ఇళ్లు కట్టుకున్నాం. ఎవరో వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. అందుకు బదులుగా మేం కౌంటర్ పిటిషన్ వేశాం. దీనిపై కలెక్టర్ ను ఆశ్రయించాం. ఈ క్రమంలోనే ఎలాంటి నోటీసులు జారీ కాకుండా మా ఇంటిని కొందరూ వ్యక్తులు కూల్చివేశారు. దయచేసి సీఎం గారు ఒక్కసారి మిమ్మల్ని కలిసేందుకు అవకాశం ఇవ్వండి. మా బాధను చెప్పుకుంటాం - గోవిందరెడ్డి, బాధితుడు

ఇదీ చదవండి: జగన్ అక్రమాస్తుల కేసు: సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.