ETV Bharat / city

‘మున్సిపల్ భూములు అమ్మడానికి వీల్లేదు’ - guntur latest news

బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములు అమ్మడం సరికాదని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మస్తాన్ వలీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మున్సిపల్ భూములు అమ్మడానికి వీల్లేదని గుర్తుచేశారు.

apcc-working-committee-president-oppose-govt-lands-sale
మస్తాన్ వలీ అభ్యర్థన
author img

By

Published : May 19, 2020, 7:12 PM IST

బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములు అమ్మడం సరికాదని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మస్తాన్ వలీ అభిప్రాయపడ్డారు. గుంటూరులోని పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్​ను అమ్మకానికి పెట్టడంపై ఆయన ఇవాళ నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధను కలిశారు. మార్కెట్​ను అమ్మివేస్తే దానిపై ఆధారపడిన వారి జీవితాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ స్థలాన్ని అమ్మకం నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. సుప్రీకోర్టు తీర్పు ప్రకారం మున్సిపల్ భూములు అమ్మడానికి వీల్లేదని గుర్తు చేశారు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.