ప్రధాని మోదీ నిర్లక్ష్య వైఖిరి వలన భారతదేశంపై దాడులు జరుగుతున్నాయని ఏపీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలీ అన్నారు. గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా దేశం పైన దాడులు జరుగుతున్నాయన్నారు. నేపాల్ వంటి చిన్న దేశాలు కూడా భారతదేశం పైన కాలు దువ్వుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ నిర్లక్ష వైఖిరి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అంత కుదేలవుతోందని అన్నారు. ఆయన భారతీయులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు రేపు ఘనంగా నివాళులర్పిస్తామన్నారు. వీర మరణం పొందిన సైనికులకు 'సెల్యూట్' అనే పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రేపు ప్రధాని మోదీ నిర్లక్ష్య వైఖిరికి నిరసనగా మౌన దీక్ష చేపడతామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ హాజరు అవుతారని మస్తాన్ వలీ వివరించారు.