తితిదే ఆస్తుల వేలంపై భాజపా తలపెట్టిన ఉపవాస దీక్ష యధాతథంగా కొనసాగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల వేలం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భాజపా రాష్ట్ర వ్యాప్త దీక్షలకు పిలుపునిచ్చింది. అయితే ప్రభుత్వం ఆస్తుల వేలం ప్రక్రియను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయినప్పటికీ భాజపా శ్రేణులు మంగళవారం దీక్షలో పాల్గొనాలని కన్నా పిలుపిచ్చారు. దేవాలయాల ఆస్తుల పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ అంశంపై భాజపా రాజీ లేని పోరాటం చేస్తుందని ఆయన స్పష్టంచేశారు. ఈ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష చేపట్టాలని సూచించారు. లాక్ డౌన్ కారణంగా తమ ఇళ్ల వద్దే దీక్ష చేయాలన్నారు. గుంటూరులోని తన నివాసం వద్ద కన్నా లక్ష్మీనారాయణ దీక్ష చేయనున్నారు.
ఇదీ చదవండి : తితిదే ఆస్తుల విక్రయ తీర్మానం నిలుపుదల