అరెస్టులతో అమరావతి ఉద్యమం ఆగదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. మీడియాపై దాడి కేసులో అరెస్టయి గుంటూరు జైలులో ఉన్న 14 మంది రాజధాని రైతులు ఇవాళ విడుదలయ్యారు. జైలు వద్ద గల్లా జయదేవ్ వారికి స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడిన జయదేవ్.. పోలీసులు ఉన్నతాధికారుల మాటలకే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప రాజ్యాంగాన్ని, చట్టాలను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. తీవ్రవాదులతో వ్యవహరించినట్లు రైతులతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో మహిళలపై జరిగిన దాడిని కేంద్ర మహిళా కమిషన్కు వివరిస్తామని తెలిపారు. పోలీసుల అణచివేత చర్యలు తమని ఆపలేవని రాజధాని రైతులు స్పష్టం చేశారు. వైకాపాకు ఓటు వేసినందుకు మాకు ఫలితం ఇదా అని వారు ప్రశ్నించారు.
ఇవీ చదవండి..
వైకాపా ప్రభుత్వ అసమర్థత.. రాష్ట్రంలో కశ్మీర్ తరహా పరిస్థితులు