గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు వాహనంలో ఆయన బంధువులు పనిమీద గుంటూరు వచ్చారు. తిరిగి వెళ్తున్న క్రమంలో వినుకొండ మండలం శివపురం వద్ద ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కారు ప్రమాదవశాత్తు చెట్టుని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సన్నిహితుడు బొజ్జా పాండు రంగారావు అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగ్రాతులను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియగానే ఎమ్మెల్యే రాంబాబు.. వినుకొండకు బయలుదేరారు.
ఇదీ చూడండి: శవమై తేలిన సర్పంచ్ అభ్యర్థి భర్త ..నిన్న అపహరణకు గురైన మృతుడు