ETV Bharat / city

Leaders on Liquor deaths: నాటుసారా మరణాలు ప్రభుత్వానికి పట్టవా..? వివిధ పార్టీల నేతల ఆగ్రహం..

Leaders on Liquor deaths: జంగారెడ్డి గూడెంలో సంభవించిన నాటుసారా మరణాలపై వివిధ పార్టీల నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ ఘటనపై మానవహక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పేర్కొన్నారు. 40మంది నాటుసారా తాగి మరణిస్తే.. సహజ మరణాలు అంటూ.. స్వయాన ముఖ్యమంత్రి చెప్పడం హాస్యస్పదం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు.

Leaders on Liquor deaths
Leaders on Liquor deaths
author img

By

Published : Mar 17, 2022, 8:53 PM IST

Leaders on Liquor deaths: జంగారెడ్డి గూడెంలో సంభవించిన నాటుసారా మరణాలపై వివిధ పార్టీల నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు.

జంగారెడ్డి గూడెంలో మరణాలకు గల కారణాలు బయటకు తీసుకురావాలి -పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్

Sailajanath on Liquor: జంగారెడ్డిగూడెం నాటుసారా ఘటనపై.. మానవహక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న మరణాలకు గల కారణాలు బయటకు తీసుకురావాలన్నారు. ఇప్పటి వరకు ఎక్సైజ్ మంత్రి.. ఎందుకు జంగారెడ్డిగూడాన్ని సందర్శించలేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై హైకోర్టులో కూడా పిల్ దాఖలు చేస్తామన్నారు. నాటుసారా తాగి అనేకమంది చనిపోతున్నారని, అధికార యంత్రాంగం ఒత్తిళ్లకు భయపడి సహజ మరణలుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

బాధితులకు రూ.25లక్షలు పరిహారం అందించే వరకూ పోరాడుతాం -సీపీఐ రామకృష్ణ

CPI RamaKrishna : జంగారెడ్డిగూడెంలో 40మంది నాటుసారా తాగి మరణిస్తే.. సహజ మరణాలు అంటు.. స్వయాన ముఖ్యమంత్రి చెప్పడం హాస్యస్పదం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా మృతుల కుటుంబాలను పరామర్శించారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా మరణాలు వెలుగు చూసినప్పటి నుంచి 140 నాటుసారా కేసులు ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించారు. 156మందిని ఎందుకు అరెస్టు చేశారని నిలదీశారు. ప్రభుత్వం బాధితులకు 25లక్షల రూపాయలు పరిహారం ఇచ్చే వరకు పోరాటం చేపడతామని అన్నారు.

తప్పించుకోవాలని చూసినా వదలం -తెదేపా దీపక్ రెడ్డి

TDP Deepak Reddy : నాటుసారా మరణాలపై అసెంబ్లీలో కనీసం అరగంట చర్చకు ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి నిలదీశారు.నాలుగు రోజుల పాటు గొంతులు పోయే విధంగా కల్తీ సారాపై చర్చకు అడిగినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం కల్తీసారాపై సభ నుంచి పారిపోయిందని విమర్శించారు. తప్పించుకోవాలని చూసినా వదలమని హెచ్చరించారు. చర్చకు అనుమతి ఇవ్వనప్పుడు ఇక సమావేశాలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.

ఇదీ చదవండి : Lokesh News: తెదేపా అలా చేసి ఉంటే జగన్ అధికారంలోకే వచ్చేవారా ?: లోకేశ్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.