ETV Bharat / city

ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో "ప్రత్యేక గ్రీవెన్స్ సెల్" - ఏలూరు కలెక్టరేట్​లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్యాలయంలో సచివాలయ ఉద్యోగ అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి అభ్యర్థుల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు.

special-grievance-cell-at-eluru-collectors-office-for-ward-secretary-aspirants
author img

By

Published : Nov 7, 2019, 5:22 PM IST

ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో "ప్రత్యేక గ్రీవెన్స్ సెల్"
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ అభ్యర్థుల నుంచి వినతులు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు స్వీకరించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు కొందరు తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం ఇచ్చారని, కొన్ని కారణాల వల్ల సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాలేకపోయామని తెలిపారు. 15 వెయిటేజీ మార్కులు కలవలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల ఫిర్యాదులపై స్పందించిన జిల్లా కలెక్టర్... అభ్యర్థులకు న్యాయం చేసేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి అభ్యర్థికి న్యాయం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా కొందరూ సచివాలయ ఉద్యోగులు బదిలీల కోసం దరఖాస్తులు చేసుకోగా... కలెక్టర్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి :ఉత్తమ పాఠశాలలో విద్యార్థులు ఫుల్​... సౌకర్యాలు నిల్​..

ఫీడ్: AP_TPG_08_06_SACHIVALAYA_GREEVENS_AV_AP10089 రిపోర్టర్: పి.చింతయ్య సెంటర్: ఏలూరు, ప.గో.జిల్లా ( ) పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి గ్రామ వార్డు సచివాలయ నిరుద్యోగ అభ్యర్థుల నుంచి వినతులు ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు స్వీకరించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు కొందరు తన కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం ఇచ్చారని, కొన్ని కారణాలవల్ల సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాలేక పోయాను, 15 వెయిటేజీ మార్కులు తనకు కలవలేదని, తదితర కారణాలతో అభ్యర్థులు అర్జీలను సమర్పించి తమకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కలెక్టర్ ను వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ వార్డు ఉద్యోగులకు అర్హులైన అభ్యర్థులకు పారదర్శకంగా పూర్తి న్యాయం చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. అర్హత అవకాశం ఉన్న ప్రతి అభ్యర్థికి న్యాయం చేస్తామన్నారు. ఇటీవలనే సచివాలయ ఉద్యోగాలు పొంది జాయిన్ అయిన కొంతమంది బదిలీల కోసం దరఖాస్తు సమర్పించేందుకు రావడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలలో జాయిన్ అయ్యి నెలరోజులు కూడా కాకుండానేఅప్పుడే తాము కోరుకున్న ప్రాంతాలకు బదిలీ కోరుతూ రావడం ఏమిటని ప్రశ్నించారు. వచ్చిన ఉద్యోగాలు సక్రమంగా చేసుకోవాలని, ఎక్కడైనా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా తమ బాధ్యతలు నిర్వర్తించాలని అన్నారు.అభ్యర్థుల నుంచి వచ్చిన ప్రతి అర్జీని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.