ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లా అంబాజిపేటలో వాన కురవటం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారు. వరిపంట కోతకు వచ్చిన సమయంలో వర్షంతో నష్టం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోనసీమలో చల్లని వాతావరణం నెలకొంది. వాతావరణ మార్పులు కారణంగా ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిశాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఉక్కబోతతో అల్లాడిన ప్రజలు వాతావరణం చల్లబడడం వల్ల ఉపశమనం పొందారు. వరికోతకు సమయం దగ్గర పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చదవండి: 34 కొత్త కేసులు.. ముగ్గురు పిల్లలకు కరోనా పాజిటివ్