NTR Statue Issue : ఏలూరు జిల్లా పెదపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వివాదాలకు దారితీసింది. ప్రధాన కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి ఏర్పాటు చేశారు. పాత దిమ్మెపైనే ఎన్టీఆర్ కొత్త విగ్రహాన్ని అభిమానులు, తెదేపా కార్యకర్తలు ఏర్పాటు చేశారు. అయితే.. అనుమతి లేదని పోలీసులు, అధికారులు తొలగించేందుకు సిద్ధమయ్యారు. దీంతో తెదేపా కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. దీంతో.. ఉద్రిక్తత తలెత్తే పరిస్థితి కనిపించడంతో.. తెదేపా నాయకులతో అధికారులు మాట్లాడారు. విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదని, అందువల్ల అనుమతి తెచ్చుకోవాలని.. అప్పటి వరకు విగ్రహానికి ముసుగు వేస్తున్నట్లు తెలిపారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
ఇవీ చదవండి :
- ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి.. ఆపై సెల్ఫీ ఫోజులు..!
- Teacher: చీటీల పేరుతో ప్రభుత్వ టీచర్ మోసం.. తర్వాత?
- NTR Birthday: ఎన్టీఆర్తో మామూలుగా ఉండదు.. ఏదైనా రాయల్గానే..