జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం కేంద్రంలోని హైస్కూల్ నందు జగనన్న విద్యా కార్యక్రమం ప్రారంభానికి పిలిచి తనని అవమానించారంటూ స్థానిక ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులకు ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదా అంటూ అధికారులను నిలదీశారు. తదనంతరం వైకాపా ఇన్చార్జ్ పీవీఎల్ నరసింహ రాజు ఎటువంటి ప్రోటోకాల్ పాటించకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు బ్యాగ్లు, యూనిఫామ్ అందించారు.
ఇదీ చదవండి: ఎంపీ రఘురామ కృష్ణరాజు సంస్థపై సీబీఐ కేసు