పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజల అస్వస్థతకు కారణాలు ఏంటనేది అంతు పట్టడం లేదు. నీటి నమూనాల్లో సీసం, నికెల్ లాంటి భార లోహాలు పరిమితికి మించి ఉన్నాయని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. అలాగే పురుగుమందుల తాలూకు ఆర్గానో క్లోరిన్ లాంటి విష పదార్థాలు కూడా నీటిలో కలిసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏలూరులో నవంబరు 22వ తేదీ నుంచే ఈ తరహా వింత వ్యాధి కేసులు ఒకటి, రెండు వచ్చినా స్థానిక వైద్యుల వద్దే చికిత్స చేయించుకోవటంతో వెలుగు చూడలేదని తెలిసింది. తాజాగా పడమర, దక్షిణపు వీధిలో ఒక్కసారిగా వందలాది కేసులు బయటపడటంతో ఈ అంశం సంచలనంగా మారింది.
బ్రిటీష్ కాలం నాటి ఏలూరు తాగునీటి వ్యవస్థకు కాల క్రమేణా కొన్ని మార్పులు చేశారు. అయినప్పటికీ వేలాది కిలోమీటర్ల పొడవైన నీటి పైపులు కొన్ని పారిశుద్ధ్యం లోపించిన ప్రదేశాల గుండా వెళ్తుండటంతో మంచినీరు కలుషితమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలానే బ్రిటీష్ పాలకుల హయాంలో 1919లో నిర్మించిన సాగునీటి పైపులు, ట్యాంకులను నగరంలో ఇంకా వినియోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కరోనా సమయంలో బ్లీచింగ్, క్లోరిన్ల పిచికారీ కూడా ఈ వ్యాధికి కారణం కావొచ్చని జాతీయ పరిశోధనా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ క్రమంలో ఏలూరు తాగునీటి వ్యవస్థకు సంబంధించి క్షేత్రస్థాయి వివరాలను వీడియోలో చూడండి.
ఇదీ చదవండి