ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలను ప్రకటించేందుకు హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు.. ఈ నెల 25వ తేదీన కార్పోరేషన్ ఓట్లను లెక్కించనున్నారు. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఏడాది మార్చి 10వ తేదీన ఏలూరు కార్పోరేషన్ కు ఎన్నికలు జరిగాయి. ఏలూరు కార్పోరేషన్ లో 50 డివిజన్లున్నాయి. వీటిలో మూడు స్థానాలను వైకాపా ఏకగ్రీవంగా గెలుపొందింది. మిగిలిన 47 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏలూరు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపునకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని కార్పోరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో వైకాపా విజయం సాధించింది. విపక్షాలు నామమాత్రంగానే విజయం సాధించారు. కోర్టులో కేసు కారణంగా ఎన్నికల కౌంటింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో కౌంటింగ్ కు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.
ఇదీ చదవండి: