పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వందల సంఖ్యలో ప్రజలు అస్వస్ధతకు గురి కావటం పట్ల రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆందోళన వ్యక్తం చేశారు. స్ధానిక పరిస్ధితులపై ఆరా తీశారు. వైద్య ఆరోగ్య శాఖ మరింత వేగవంతమైన చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. బాధితులకు సత్వరమే వైద్య సహాయం అందేలా చూడాలన్నారు.
ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సమస్యకు కారణం ఏమిటన్నదానిపై వైద్య అరోగ్య శాఖ అధ్యయనం చేస్తుండగా.. ఉన్నత స్థాయి నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆ శాఖను గవర్నర్ ఆదేశించినట్లు రాజ్‌భవన్ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: