ETV Bharat / city

వేదికలు వెలవెల.. రూ.వేల కోట్ల నష్టం

సినిమా థియేటర్లు, పర్యాటక ప్రదేశాలు, ప్రయాణాలు, వ్యాయామశాలలు... ఒక్కటేమిటి కరోనా సృష్టించిన కల్లోలానికి దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి అన్ని రంగాలు. వేల కోట్ల ఆదాయం నష్టం. కనీస ఉపాధిలేక అర్ధాకలితో బతుకుతున్నారు ఈ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నవారు. ఆదాయం లేక నిర్వహణ భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు నిర్వాహకులు.

author img

By

Published : Jul 18, 2020, 8:31 AM IST

వేదికలు వెలవెల.. రూ.వేల కోట్ల నష్టం
వేదికలు వెలవెల.. రూ.వేల కోట్ల నష్టం

వివిధ రంగాలు, వ్యాపారాలను కరోనా కోలుకోలేని దెబ్బతీస్తోంది. పర్యాటక కేంద్రాలు, సినిమా థియేటర్లు, కల్యాణ మండపాలు, వ్యాయామశాలలు వంటివి తెరిచే పరిస్థితి లేక వాటి యాజమాన్యాలు, ఆధారపడ్డ కార్మికులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మార్చి నుంచి అవి రూ.వేల కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంటున్నాయి. వీటికి తోడు మితిమీరిన నిర్వహణ భారం ఆయా రంగాల నడ్డి విరుస్తోంది. లాక్‌డౌన్‌ మినహాయింపులతో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయా? లేదా? అని వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. లాక్‌డౌన్‌కు నెల రోజుల ముందు నుంచే పర్యాటక రంగం నష్టాల బాట పట్టింది. విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారితోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చే పర్యాటకులే కనిపించడం లేదు.

రాష్ట్రంలో ఉన్న 600 స్టార్‌ హోటళ్లలో ఇప్పటికి కేవలం 30 శాతమే తెరుచుకున్నాయి. వాటి ఆక్యుపెన్సీ పది శాతమే ఉంటోంది. ఆదాయం లేక, నిర్వహణ భరించలేక కొన్ని హోటళ్లు మూసేస్తున్నారు. మార్చి నుంచి నెలకు రూ.250 కోట్ల చొప్పున రూ.వెయ్యి కోట్లు నష్టపోవాల్సి వచ్చిందని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. పర్యాటకులు లేక రూ.150 కోట్ల వ్యాపారాన్ని కోల్పోయామని ప్రైవేటు టూర్‌ ఆపరేటర్లు వివరించారు. పర్యాటకశాఖ ఇప్పటివరకూ రూ.60 కోట్లు నష్టపోయింది.

కష్టాలకు ‘తెర’ పడేదెప్పుడో?

ప్రదర్శనలకు ఎప్పుడు అనుమతులిస్తారో తెలియక రాష్ట్రంలోని సుమారు 1700 సినిమా థియేటర్ల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఒక్కో థియేటర్‌ నెలకు కనీసం రూ.3 లక్షలకుపైనే ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. థియేటర్‌లో పనిచేసే వాచ్‌మెన్‌, ఇతర సిబ్బందికి వేతనాలు, విద్యుత్‌ ఛార్జీలు, నిర్వహణ కోసం కనీసం నెలకు రూ.50 వేలపైనే వెచ్చించాల్సి వస్తోందని యాజమాన్యాలు చెబుతున్నాయి. వీటిపై ఆధారపడ్డ 25 వేల మంది కుటుంబాల కష్టాలు వర్ణనాతీతం.

కల్యాణ మండపాలకు కలిసిరాని ముహూర్తం

కల్యాణ మండపాలు, కన్వెన్షన్‌ సెంటర్లకు వ్యాపారమే కరవయింది. రాష్ట్రంలో ఓ స్థాయి కల్యాణ మండపాలు, కన్వెన్షన్‌ సెంటర్లు 300 వరకు ఉన్నాయి. 4 నెలలుగా రూ.500 కోట్ల వరకూ వ్యాపారాన్ని కోల్పోయామని వాటి నిర్వాహకులు చెబుతున్నారు. ఫంక్షన్‌హాళ్లకు అనుమతినిచ్చినా వివాహానికి అతిథుల సంఖ్యను పరిమితం చేశారు. దీంతో ఈ రంగంపై ఆధారపడ్డ నగలు, పెళ్లి పత్రికల ముద్రణ, మండపాల అలంకరణ, క్యాటరింగ్‌ సేవలందించే లక్షల మంది ఉపాధి కోల్పోయారు.

గాడిన పడని ప్రైవేటు బస్సు

లాక్‌డౌన్‌ మినహాయింపులు లభించినప్పటికీ ప్రైవేటు బస్సులు పూర్తి స్థాయిలో రోడ్డెక్కలేదు. రాష్ట్రంలో ప్రైవేటు బస్సులు 1,200 వరకు ఉంటే అందులో ప్రస్తుతం వంద మాత్రమే నడుస్తున్నాయి. వాటిలోనూ ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటోంది. అంతర్‌రాష్ట్ర సర్వీసులకు అనుమతినివ్వకపోవడం యజమానులకు శరాఘాతమవుతోంది.

వ్యాయామశాలలకు అద్దె భారం

వ్యాయామశాలలు తెరిచేందుకు అనుమతుల్లేక నిర్వాహకులు, ఫిట్‌నెస్‌ శిక్షకులు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. వ్యాయామశాలలు చాలావరకు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. 4నెలలుగా మూసేసి ఉన్నప్పటికీ అద్దె భారం మాత్రం తప్పడం లేదు.

వస్త్ర వ్యాపారం.. వందల కోట్ల నష్టం

వస్త్ర దుకాణాలు తెరిచేందుకు అనుమతించినా వ్యాపారం 20 శాతం మించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల వరకు చిల్లర, టోకు వస్త్ర దుకాణాలున్నాయి. 3 నెలల వ్యవధిలో రూ.500 కోట్లకుపైనే నష్టపోవాల్సి వచ్చిందని వస్త్ర పరిశ్రమ సంఘాల నేతలు చెబుతున్నారు. దుకాణాల అద్దె, సిబ్బంది వేతనాలు, పన్నుల భారం తడిసి మోపడవుతోందని వాపోతున్నారు. వస్త్ర దుకాణాలపై ఆధారపడ్డవారి సంఖ్య లక్షల్లోనే ఉంది.

ఇదీ చదవండి : మద్యం కోసం మహిళలు క్యూ.. దీని వెనక ఓ కథ ఉందండోయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.