ఏలూరులో అంతుబట్టని వ్యాధితో విలవిల్లాడుతున్నవారికి అసలు ఏం జరిగిందనేది పరిశీలించి... మెరుగైన వైద్యం అందించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏలూరు ఘటనను మొదట ప్రభుత్వం పట్టించుకోలేదని... ఇప్పుడు అవగాహన లేకుండా చర్యలు చేపడుతుందని విమర్శించారు. కారణాలు తెలియవని వాదించడం ప్రభుత్వ వితండవాదమేనని అన్నారు. ప్రజల ప్రాణాలకు ప్రభుత్వం భరోసా కల్పించలేకపోతోందని చంద్రబాబు ఆరోపించారు.
క్రమపద్ధతి ప్రకారం పారిశుద్ధ్యం నిర్వహిస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావని... చేతకాని ప్రభుత్వం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని దుయ్యబట్టారు. ఎంత సేపు తెదేపా నేతలను దెబ్బతీయాలని చూస్తున్నారు తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు. ఏలూరు ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఏలూరు ప్రాంతంలో సరైన చర్యలు చేపట్టి.... ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు.
ఇదీ చదవండి: