Boats Rally: నరసాపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని కొనసాగించే ఉద్యమాన్ని అణచివేయాలనుకుంటే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు హెచ్చరికలు జారీచేశారు.
మొగల్తుర్రులో జేఏసీ ఆధ్వర్యంలో నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రధాన పంట కాల్వలో పడవల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా.. నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని నినాదాలు చేశారు. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాలి అన్నట్లు ముద్దనూరు ప్రసాద్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కేంద్రం ప్రకటన వచ్చేవరకూ ఉద్యమం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి : Suicide: యువకుడి ఆత్మహత్య.. సీఐ కొట్టడం వల్లేనంటూ బంధువుల ఆందోళన