- CBN: ప్రజల మనోభావాలకు విరుద్ధంగా జిల్లాల పునర్విభజన: చంద్రబాబు
ప్రజల మనోభావాలకు విరుద్ధంగా జిల్లాల పునర్విభజన నిర్ణయం తీసుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
- GoIR: 'జీఓఐఆర్ వెబ్‌సైట్‌ను పూర్తిగా మూసివేయటం చట్టవిరుద్దం'
జీవోఐఆర్ అంశంపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై ఇవాళ విచారణ జరిగింది. గత 9 నెలల్లో ఎన్ని జీవోలను వెబ్సైట్లో ఉంచారో.., ఎన్ని జీవోలను పక్కనపెట్టారో.., దానికి గల కారణాలతో కూడిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ముందుంచింది.
- Ap corona cases: రాష్ట్రంలో కొత్తగా 5,879 కరోనా కేసులు.. 9 మరణాలు
రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 25,284 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 5,879 కేసులు నమోదయ్యాయి.
- Agitations: ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలంటూ.. అమరావతి రైతుల ధర్నా
తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలంటూ అమరావతి రైతులు, మహిళా కూలీలు గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ మేరకు గుంటూరు కలెక్టరేట్ ఎదుట జనం పార్టీ, రాష్ట్రీయ మహాజన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో రైతు కూలీలు, మహిళలు పాల్గొన్నారు.
- ట్విట్టర్లో గవర్నర్‌ను బ్లాక్ చేసిన సీఎం.. కారణమిదే..
బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ను ట్విట్టర్లో బ్లాక్ చేశారు. ఆయన ట్వీట్లతో మనస్తాపం చెందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బంగాల్ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ధన్కర్ బెదిరిస్తున్నారని మమత తీవ్ర ఆరోపణలు చేశారు.
- లక్కీ ఫ్యామిలీ.. 24ఏళ్ల క్రితం చోరీకి గురైన బంగారం ఇప్పుడు వాపస్!
24 ఏళ్ల క్రితం దొంగతనానికి గురైన కోట్లు విలువైన బంగారు ఆభరణాలను హక్కుదారులకు తిరిగి అప్పజెప్పారు పోలీసులు. ఈ ఘటన ముంబయిలోని కొలాబా ప్రాంతంలో జరిగింది.
- కంట్రోల్ తప్పిన రాకెట్.. అస్తవ్యస్తంగా చక్కర్లు.. మార్చిలో చంద్రుడ్ని ఢీ!
అంతరిక్షంలో ఓ రాకెట్ కంట్రోల్ తప్పి పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తోంది. భూమి, చంద్రుడి చుట్టూ ఇష్టారీతిలో తిరుగుతోంది. మరి కొద్ది రోజుల్లోనే అది జాబిల్లిని ఢీకొట్టనుందని ఆస్ట్రేలియాలోని ఖగోళ శాస్త్రవేత్త అంచనా వేశారు. గంటకు 9 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నట్లు చెప్పారు.
- బడ్జెట్‌పైనే అందరి కళ్లు.. వివిధ రంగాలు ఆశిస్తున్నవేంటి?
కరోనా మహమ్మారితో అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. కొవిడ్ మూడో దశ కొనసాగుతన్న ఈ సమయంలో పార్లమెంట్లో మంగళవారం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ బడ్జెట్లో తమకు ఊరట కల్పిస్తారని అంతా ఆశగా చూస్తున్నారు.
- ATP Rankings: 21 ఏళ్లు వెనక్కి ఫెదరర్- నెం.1గా 358 వారంలో జకో
ఏటీపీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 21 ఏళ్ల కనిష్ఠ ర్యాంకుకు పడిపోయాడు స్విస్ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్. మరోవైపు అగ్రస్థానంలో కొనసాగుతున్న సెర్బియా స్టార్ నొవాక్ జకొవిచ్.. నెం.1గా 358వ వారంలోకి ప్రవేశించాడు.
- 'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్ ఇదే.. రామ్‌చరణ్ బర్త్‌డేకు ముందే..
'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. ముందుగా అనుకున్న రెండు తేదీలు కాకుండా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపింది.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7PM - ఏపీ ముఖ్యవార్తలు
.
ఏపీ ప్రధాన వార్తలు @7PM