ETV Bharat / city

ఏలూరు రంగంలోకి.. 870 బృందాలు - దిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లిన నగర వాసులు

ఏలూరు నగరంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జిల్లాలో 14 కరోనా కేసులు నమోదు కావటం.. అందులో ఏకంగా 6 ఏలూరుకు చెందినవే కావటంపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఏలూరు నగరం, పోణంగి వైఎస్సార్‌ కాలనీల్లో బాధితులు ఉన్నట్లు తెలియగా.. నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. కేసులున్న ప్రాంతాలైన తంగెళ్లమూడి, వన్‌టౌన్‌లోని తూర్పువీధి వీవర్స్‌ కాలనీ, ఏలూరు శివారు పోణంగి వైఎస్సార్‌ కాలనీల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. మొత్తం 870 బృందాలను నగరంలో రంగంలోకి దింపారు.

west godavari
ఏలూరు.. రంగంలోకి 870 బృందాలు
author img

By

Published : Apr 2, 2020, 3:43 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో 14 కరోనా కేసులు నమోదు కావటంపై ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏలూరు, నరసాపురం డివిజన్‌ పరిధిలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కేసులున్న ప్రాంతాలైన తంగెళ్లమూడి, వన్‌టౌన్‌లోని తూర్పువీధి వీవర్స్‌ కాలనీ, ఏలూరు శివారు పోణంగి వైఎస్సార్‌ కాలనీల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. మొత్తం 870 బృందాలను నగరంలో రంగంలోకి దింపారు.

అప్రమత్తమైన యంత్రాంగం

కలెక్టర్‌ ముత్యాలరాజు ఆదేశాల మేరకు మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌, పీవో హరిబాబు ఇతర అదికారులు తంగెళ్లమూడి, తూర్పువీధి వీవర్స్‌ కాలనీల్లో పర్యటించారు. పాజిటివ్‌ కేసులు నమోదైన కుటుంబాలను పరిశీలించారు. వారందరికీ హోమ్‌ క్వారంటైన్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు మొత్తం 500 మంది, పారిశుద్ధ్య కార్మికులు 100మంది విధుల్లో పాల్గొన్నారు. ఏలూరు డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు.

ఇంటింటి సర్వే

తంగెళ్లమూడి ప్రాంతంలో మొత్తం 4 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. యాదవ్‌నగర్‌, కబాడీగూడెం, చాకలిపేట, ఉర్దూ బాలుర పాఠశాల సమీపాల్లో బాధితుల నివాసాలున్నాయి. దీంతో ఇంటింటి సర్వే నిర్వహించి అవసరమైన వారికి వైద్య పరీక్షలు చేశారు. వీవర్స్‌ కాలనీలో 2400 కుటుంబాలకు సర్వే నిర్వహించి వైద్య పరీక్షలు చేశారు.

ఎవరెవరిని కలిశారనే దానిపై ఆరా..

దిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లిన నగర వాసులు, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు అక్కడ కార్యక్రమం ముగించుకున్నాక ఒకేసారి స్వగ్రామానికి రాకుండా దఫదఫాలుగా వచ్చారని అధికారులు చెప్పారు. కొన్ని రోజులుగా అక్కడ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి వెళ్లినవారు 3 దశలుగా వచ్చినట్లుగా గుర్తించారు. కొందరు 10 రోజుల కిందట రాగా మరికొందరు వారం రోజుల కిందట వచ్చిన వారు ఉన్నారు. మరికొందరు అంతకుమందే వచ్చారు. ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు వచ్చిన బాధితులు వారి కుటుంబాలతో ఎక్కువ రోజులు గడిపారు. అందువలన కుటుంబ సభ్యులపై ప్రధానంగా అధికారులు దృష్టి పెట్టారు. దీంతో పాటు ఇళ్లకు వచ్చిన వీరంతా తరువాత ఎక్కడెక్కడకు వెళ్లారు ఎవరెవరిని కలిశారు అనే వారందరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని తదుపరి వైద్య సేవలు, నమూనాలు సేకరణ వంటి పనులను చకచకా నిర్వహించేలా అధికారులు పూర్తి కార్యాచరణకు కసరత్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరోజే 14 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.