ETV Bharat / city

ఈవీఎం ధ్వంసం.. జనసేన అభ్యర్థి అరెస్టు - janasena candidate arrest

అనంతపురం జిల్లా గుంతకల్లు శాసనసభ నియోజకవర్గ జనసేన అభ్యర్థి... గుత్తిలోని ఓ పోలింగ్ కేంద్రంలో విధ్వంసం సృష్టించారు. గుత్తి బాలికోన్నత పాఠశాలలోని 183వ నెంబరు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన ఆయన.. ఈవీఎం యంత్రాన్ని నేలకేసి కొట్టారు.

evm damage
author img

By

Published : Apr 11, 2019, 8:32 AM IST

Updated : Apr 11, 2019, 3:13 PM IST

ఈవీఎం ధ్వంసం.. జనసేన అభ్యర్థి అరెస్టు

అనంతపురం జిల్లా గుంతకల్లు శాసనసభ నియోజకవర్గ జనసేన అభ్యర్థి... గుత్తిలోని ఓ పోలింగ్ కేంద్రంలో విధ్వంసం సృష్టించారు. గుత్తి బాలికోన్నత పాఠశాలలోని 183వ నెంబరు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన ఆయన.. ఈవీఎం యంత్రాన్ని నేలకేసి కొట్టారు. ఓటింగ్‌ కంపార్టుమెంట్లలో నియోజకవర్గం పేర్లు సరిగా రాయలేదని ఆగ్రహించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఇలాగే ఈవీఎంలను పగలగొడతానంటూ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. ఈ పరిణామంతో.. జనసేన అభ్యర్థి మధుసూదన్‌గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు.

Intro:Ap_cdp_47_10_NRI lu_vote kosam_videsala nunchi_Av_c7
ఒక ఓటు కోసం దేశంకాని దేశం నుంచి ఎందుకు వెళ్లాలని వారు అనుకోలేదు.. ఓటు విలువ తెలుసుకున్నారు. ఒక్కటే విజయానికి ఎంతో దోహదపడుతుందని గ్రహించారు. నవ సమాజ నిర్మాణానికి ఓటు ద్వారా మన వంతు సహకారం అందించాలని భావించారు ఎన్నారైలు.. అమెరికా, ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్, ఖతర్ వంటి దేశాల నుంచి రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాలకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఓటు పండగ చేసుకోవడానికి వీరంతా సమాయత్తమయ్యారు. అమెరికా నుంచి రాజంపేట లోని స్వగ్రామానికి రావడానికి సుమారు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. కువైట్, దుబాయ్ వంటి ప్రాంతాల నుంచి రావడానికి సుమారు 30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు పెట్టుకొని కేవలం ఒక్క ఓటు వేయడానికి ఎన్నారైలు తరలివచ్చారు. వారే కాదు వారి భార్య పిల్లలతో సహా గ్రామాలకు చేరుకున్నారు. ఓటు ప్రాధాన్యత తెలుసుకున్నాం... ఓటు వేయాలని పదిమందికి చెబుతున్నట్లు ఎన్నారైలు తెలిపారు. ఓటు వేయడానికి తనతో పాటు వేలాది మంది ఎన్నారైలు, వారి వారి స్వగ్రామాలకు చేరుకున్నట్లు తానా అధ్యక్షుడు వేమన సతీష్ తెలిపాడు. ప్రతి యువకుడు పోలింగ్ కేంద్రానికి వెళ్లి తప్పక ఓటు వేయాలని కోరారు. అంత దూరం నుంచి ఓటు వేయడానికి తాము వచ్చామని, ఇక్కడ ఉన్న యువతీ యువకులు కూడా పోలింగ్ కేంద్రాల కి తరలి వచ్చి మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకులను ఎన్నుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఇంకా పలువురు ఎన్నారైలు తమ అభిప్రాయాలను ఇలా వ్యక్తం చేశారు.

Body:ఓటు కోసం విదేశాల నుంచి తరలివచ్చిన ఎన్నారైలు

Conclusion:కడప జిల్లా రాజంపేట
Last Updated : Apr 11, 2019, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.