కొవిడ్ రోగులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా వైకాపా రాష్ట్ర కొవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. సేవలు అందించేందుకు 9143541234, 9143641234 వాట్సాప్ ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రజలు వీటిని వినియోగించుకోవాలని సూచించారు.
కొవిడ్ సెంటర్లలో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందేలా పార్టీ నేతలు కృషి చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. స్థానికంగా కొవిడ్ సెంటర్లు లేని పక్షంలో అధికారులతో మాట్లాడి తక్షణమే వాటిని ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు తమతమ నియోజకవర్గాల్లో కొవిడ్ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, అందులో రెండు ఫోన్ నెంబర్లు కేటాయించాలని సూచించారు.
ఇదీ చదవండి:
కొవిడ్ వైద్య చికిత్సలపై హైకోర్టులో విచారణ.. సర్కార్ తీరుపై అసంతృప్తి