కనీస మద్దతుధర చట్టం తేవాలని అఖిలపక్ష భేటీలో కోరామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి (ysrcp mp Vijaya Sai Reddy on All-Party Meeting) తెలిపారు. దిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీ (ysrcp mps attending the all-party meeting in delhi) అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్లో 24 పంటలకు మద్దతుధర ఇస్తున్నామని(mp Vijaya Sai Reddy on minimum support prices) చెప్పామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని పంటలకూ మద్దతుధర ఇవ్వాలని కోరామన్న ఆయన.. కనీస మద్దతుధరపై జేపీసీ వేయాలని కోరామని చెప్పారు.
'ఆహార భద్రత చట్టంలో ఏపీకి జరిగిన అన్యాయం సరిదిద్దాలి. అణగారిన బీసీల గుర్తింపునకు సామాజిక, ఆర్థిక కులగణన చేయాలి. మహిళా రిజర్వేషన్, దిశ బిల్లు ఆమోదించాలని విజ్ఞప్తి చేశాం. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఇప్పించాలని కోరాం. తెలంగాణ ఇవ్వకుంటే కేంద్రమే భరించాలని చెప్పాం' - విజయసాయిరెడ్డి, వైకాపా ఎంపీ
ఇదీ చదవండి:
HEAVY RAINS IN AP: నిలువెల్లా జల ఖడ్గపు గాయాలే.. మళ్లీ ఉరుముతున్న వరుణుడు!