చంద్రబాబు హయాంలో ఎస్సీలపై జరిగిన దాడులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు వైకాపా తెలిపింది. ఈనెల 31వ తేదీన జిల్లా కేంద్రాల్లో నిరసన తెలియజేస్తామని ఆ పార్టీ ఎంపీ నందిగం సురేశ్, మ్మెల్యే మేరుగ నాగార్జున తెలిపారు. అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకంతో పాటు వినతిపత్రాలు అందజేస్తామని అన్నారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
తెదేపా ప్రభుత్వం ఎస్సీలను ఏ విధంగా మోసం చేశారో వివరిస్తామని నేతలు చెప్పారు. ఎస్సీలపై దాడి చేసిన వారిపై వైకాపా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వంపై తెదేపా అనవసరపు ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి