అక్టోబరు 4న వాహనమిత్ర పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. 'వైఎస్ఆర్ వాహనమిత్ర' ద్వారా ఏడాదికి రూ.10 వేల సాయం అందించనున్నారు. సొంతంగా ఆటో, క్యాబ్, టాక్సీలు నడుపుకుంటున్న వాళ్లకి ఈ పథకం వర్తించనుంది. దరఖాస్తుల స్వీకరణకు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆఫ్లైన్, ఆన్లైన్ తో నేరుగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. నేటి వరకు 94 వేల దరఖాస్తుల పరిశీలనను అధికారులు పూర్తి చేశారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులను పరిశీలించనున్నారు.
అక్టోబరు 4 నుంచి.. 'వైఎస్ఆర్ వాహనమిత్ర' - ysr vahana mithra scheme starts from octomer 4th
వచ్చే నెల 4 నుంచి వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ పథకం కింద సొంతంగా ఆటో, క్యాబ్, టాక్సీలు నడుపుకునే వాళ్లకి ఏడాదికి పది వేల రూపాయలు సాయం అందిచనుంది.
అక్టోబరు 4న వాహనమిత్ర పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. 'వైఎస్ఆర్ వాహనమిత్ర' ద్వారా ఏడాదికి రూ.10 వేల సాయం అందించనున్నారు. సొంతంగా ఆటో, క్యాబ్, టాక్సీలు నడుపుకుంటున్న వాళ్లకి ఈ పథకం వర్తించనుంది. దరఖాస్తుల స్వీకరణకు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆఫ్లైన్, ఆన్లైన్ తో నేరుగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. నేటి వరకు 94 వేల దరఖాస్తుల పరిశీలనను అధికారులు పూర్తి చేశారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులను పరిశీలించనున్నారు.
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.......................................
యాంకర్ :పాస్టర్ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్నాడు...మాయమాటలు చెప్పి మాయ చేశాడు. బయపెట్టి పాస్టర్ సొత్తు అంతా కాజేశాడు. ఏకంగా కోటి 35 లక్షల రూపాయలు విలువైన సొత్తు కాజేసి దర్జాగా జీవించాడు. చివరికి మోసం బయటపడి జైలుకి పోతున్నాడు. ప్రకాశం జిల్లా చీమకుర్తి లో బ్యాంకు మేనేజర్ పేరుతో పాస్టర్ ని ఈ విధంగా మోసం చేశాడో ఘరానా మోసగాడు.....
వాయిస్ ఓవర్ :
చీమకుర్తికి చెందిన చర్చి పాస్టర్ చిన్నపురెడ్డికి బ్రాంచ్ మేనేజర్ గా పరిచయం చేసుకున్నాడు నెల్లూరుకు చెందిన షేక్ గులాబ్ జాన్ . తమ బ్యాంకులో డబ్బులు జమ చేస్తే అధిక వడ్డీ అందిస్తామని ఆశ చూపాడు.
మొదటి విడతలో చిన్నపురెడ్డి వద్ద 5 లక్షల రూపాయలు వసూలు చేసి బ్యాంకులో డిపాజిట్ చేయకుండా సొంత అవసరాలకు వాడుకున్నాడు జానీ. పాస్టర్ ని నమ్మబలికేందుకు నెల నెలా వడ్డీ చెల్లించాడు. ఇంకా పెద్ద మొత్తం డబ్బు జమ చేస్తే అధిక వడ్డీ ఇప్పిస్తానని చిన్నపురెడ్డి వద్ద నుంచి 25 లక్షల రూపాయలు తీసుకున్నాడు నిందితుడు. అనంతరం డ్రామాకి తెరలేపాడు గులాబ్ జానీ. 25 లక్షల రూపాయలు ఒకేసారి జమ చేసినందుకు ఆదాయపన్ను శాఖ అధికారుల కన్ను నీ మీద పడిందంటూ చిన్నపురెడ్డిని బయపెట్టాడు. నువ్వు జైలుకు పోవడం ఖాయం అంటూ బెదిరించాడు. పన్ను కట్టాలంటూ పలుమార్లు డబ్బు వసూలు చేసాడు. 400 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. పలుమార్లు ఇదేవిధంగా బెదిరిస్తూ సొమ్ము తో పాటు కోటి రూపాయల విలువ చేసే స్థలాన్ని తన పేరుపై వ్రాయించుకున్నాడు నిందితుడు. చివరికి చిన్నపురెడ్డి కారుని సైతం తాకట్టుపెట్టి నగదు కాజేయడంతో స్పందన కార్యక్రమంలో ఎస్పీని ఆశ్రహించారు నిందితులు. పోలీసులు విచారణ చేపట్టి నిందితున్ని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుని వద్ద నుంచి 30 లక్షల రూపాయల నగదు, 200 గ్రాముల బంగారం, ఖాళీ ప్రామిసరీ నోట్లు, కోటి రూపాయలు విలువ చేసే స్థలం కాగితాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా పోలీసు కార్యాలయంలో ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ వివరించారు...మొత్తం సొత్తు విలువ కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. కేసు ను ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలీసులకు నగదు బహుమతి అందజేశారు....బైట్స్
1. ప్రసాద్, డీఎస్పీ, ఒంగోలు
2. చిన్నపురెడ్డి, చర్చి పాస్టర్
Body:OngoleConclusion:9100075319