రాష్ట్రవ్యాప్తంగా వివిధ చోట్ల అక్కడి ప్రజాప్రతినిధులు... వైఎస్సార్ రైతు భరోసా-పీఎమ్ కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. కృష్ణా జిల్లా పామర్రులో ఎంపీ బాలశౌరితో కలిసి మంత్రి పేర్ని నాని జిల్లాస్థాయి రైతుభరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మైలవరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో వైఎస్సార్ రైతుభరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఆదిమూలపు సురేష్.... లబ్ధిదారులకు చెక్కులు అందించారు. అద్దంకి వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాచిన చెంచు గరటయ్య రైతు భరోసా చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని కోవెలకుంట్లలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి రైతులకు చెక్కులు పంపిణీ చేశారు.
కృష్ణా జిల్లా నూజివీడులోని రోటరీ క్లబ్ ఆడిటోరియంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు చెక్కులు అందించారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి రైతుభరోసా పథకాన్ని ప్రారంభించారు. కడప జిల్లా రైల్వేకోడూరులోని తహశీల్దార్ కార్యాలయంలో ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు రైతు భరోసాను ప్రారంభించారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కుండ్రం గ్రామంలో రైతు భరోసా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ప్రారంభించి... లబ్దిదారులకు చెక్కులను అందించారు.
ఇవీ చూడండి-రైతుల్లో ఆనందం చూసేందుకే ఈ పథకం!