ETV Bharat / city

వైఎస్​ఆర్ చేయూత రెండో విడత...మహిళల ఖాతాల్లో నగదు జమ - వైఎస్సార్ చేయూత రెండో విడత నిధులు విడుదల

వైఎస్​ఆర్ చేయూత రెండో విడతను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలివిడతలో కొన్ని కారణాల వల్ల లబ్ధిపొందలేని మహిళలకు రెండో విడతలో ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ పథకాన్ని మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. అర్హులకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ.18,500 చొప్పున జమచేశామని మంత్రులు తెలిపారు.

Ysr cheyuta
Ysr cheyuta
author img

By

Published : Nov 12, 2020, 3:48 PM IST

Updated : Nov 12, 2020, 9:22 PM IST

వైఎస్​ఆర్ చేయూత రెండో విడతను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. కుల ధ్రువీకరణ పత్రాలు పొందలేక పోవడం, సాంకేతిక అంశాలు సహా పలు కారణాలతో లబ్ధిపొందని మహిళలకు రెండో విడత కింద ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం. తాడేపల్లిలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ రెండో విడత పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అర్హులైన 2 లక్షల 72 వేల మందికి రెండో విడత కింద ఒక్కొక్కరికీ రూ.18,500 చొప్పున రూ.510 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమచేశారు.

మహిళలకు ఉపాధి కల్పించడం, వృద్ధిలోకి రావాలని ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. లబ్ధిదారులకు ఒకేసారి రూ.75 వేలు వచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం రూ.18,750 ఇస్తే మిగిలినవి బ్యాంకులు రుణంగా ఇస్తున్నాయన్నారు. 21 లక్షల 189 మందికి రూ.3937 కోట్ల రుణాలు వైఎస్​ఆర్ చేయూత మొదటి విడత కింద సాయం చేశామని... ఇప్పటి వరకు 23.72 లక్షల మంది వైఎస్​ఆర్ చేయూత కింద లబ్ది పొందారని... వీరిలో 27 వేల మంది దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారని వివరించారు.

పేరొందిన సంస్థలతో మాట్లాడి మహిళలకు తక్కువ ధరకే సరకులు ఇప్పిస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. బయటి మార్కెట్ కంటే కనీసం 15 శాతం తక్కువ ధరకు వస్తువులు ఇచ్చేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. మహిళలు సొంతంగా నిలబడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం మని... మహిళలు అందరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి

చెట్టు కింద వైద్యం... అవస్థలు పడుతున్న రోగులు

Last Updated : Nov 12, 2020, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.